అట్టడుగు వర్గాల అభివృద్దే జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యులు రాఘవయ్య. నెల్లూరులోని బైపాస్ రోడ్డు లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట కో-ఆర్డినేటర్ పార్దసారధి, జిల్లా నాయకులు మనుకాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు జనసేన జెండాను ఆవిష్కరించిన ఆయన కార్యాలయంలో పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.. జనసేన యువ నాయకులు మను కాంత్ రెడ్డి ఆద్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.. పార్టీ బలోపేతంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నామన్నారు.. అందులో భాగంగానే నెల్లూరులో కూడా స్టార్ట్ చేశామన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ పటిష్టతకు దోహపడాలన్నారు.. పార్ధసారధీ మాట్లాడుతూ నాలుగేళ్లలో ఏపీలో అభివృద్ది శూన్యమని మండిపడ్డారు.. అధికార పార్టీ వైఫల్యంపై పోరాడాల్సిన ప్రతిపక్షం పత్తా లేకుండా పోయిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతున్నారన్నారు. సినీ జివితాన్ని వదులుకొని రాష్ట ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నారన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు దొంగనాటకాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. కాపులను ఓటు బ్యాంకులాగే అధికార, ప్రతిపక్షాలు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై జనసేన క్లారిటీతో ఉందన్నారు. అన్ని వర్గాలను సంతృపి పరిచే విదంగా ఫ్రీ మానిఫెస్ట్ ప్రకటించారమని పార్దసారధి అన్నారు..సుపరిపాలనే జనసేన పార్టీ లక్ష్యమన్నారు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వారు తెలిపారు.