ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రవేశపెట్టిన ఏకరీతి మూల్యాంకన సీబీఎస్‌ఈ బోర్డు సీబీ ఉపసంహరించుకుంది. ఏకరీతి మూల్యాంకన విధానం అమలు విద్యాహక్కు చట్టాన్ని అతిక్రమించడవేునని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చేసిన వాదనల మేరకు సీబీఈస్‌ఈ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకుగాను ప్రాథమికోన్నత స్థాయి నుంచే వారిపై దృష్టి సారించాలని, అందుకుగాను ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే పరీక్షలు, మూల్యాంకనం, రిపోర్టు కార్డుల జారీలో ఒకే విధానాన్ని అవలంభించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. అయితే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ నుంచి ఒత్తిడి మేరకు సీబీఎస్‌ఈ బోర్డు ఏకరీతి మూల్యాంకన విధానంపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.