YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈ వారం విశ్లేషణ..

ఈ వారం విశ్లేషణ..

- సండే.. సందడే... సందడి
గాంధీ వర్థంతి,
బడ్జెట్, చంద్రగ్రహణం, అతిపెద్ద గిరిజన జాతర వార్తలతో దినపత్రికలన్నీ పోటీపడి మంచి వార్తలు అందించాయి.

స్థానిక విలేఖరులకు ఇబ్బందిగా ఉండే కథాంశాలను 'ఈనాడు' డిజిటల్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశోధన కథనాలను అందించింది. 'సాక్షి' జగన్ వార్తలతో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్, రైతు వార్తాంశాలకు తెలంగాణ ఎడిషన్ లో ప్రాధాన్యత ఇచ్చింది.
'నమస్తే తెలంగాణ' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

'నవ తెలంగాణ' మేడారం జాతర కారణంగా ఆ,యా పరిసర ప్రాంత రైతులకు కలిగే నష్ట పరిహారం గురించి ప్రశ్నించిన తీరు అభినందనీయం.
నా, మన తెలంగాణ, మనం పత్రికలు ఆకర్షణీయమైన వార్తల కోసం ప్రయత్నం.

తెలంగాణలో రెండేళ్ళకు ఒకసారి జరిగే మేడారం జాతరకు పాఠశాలలకు సెలవు ఇవ్వకపోవడం విమర్శలకు తావిచ్చింది.

హైలైట్ ఏమిటంటే 'ఈనాడు' శ్రీధర్ వేసిన కార్టూన్ "మల్లెపూవు పాతిక రూపాయలు" ఆకట్టుకుంది.

"పత్రికలకు అందని వార్తలు"

(1) ఖాకీ వారెంట్ కు
కలం కరెంట్:
వేటాడుతున్న ఖమ్మం ఎఫ్.ఐ.ఆర్ 
2013లో జరిగిన ఆరాచకం అధికారులు మరిచిపోయారు.
'దెబ్బతిన్న పులి' మాత్రం
వేటాడుతూనే ఉంది. ఆ పులి పంజాకు
'ఆరోజు అందులో చేతులు పెట్టిన కెలికిన ఓ ఎఎస్పీ... బలైంది. { నాటి వీడియోలలో ఆ ఛానల్ లోగో పెద్దగా ఎవరూ గమనించ లేదు}
భవిష్యత్తులో..
ఓ ఐపీఎస్ ను వేటాడబోయేది... కూడా
ఆ ఎఫ్.ఐ.ఆరే... కొందరితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఆనాడు వ్యవహరించారు.
నాటి బాధితుడు నేడు ఓ ఛానల్ సి.ఇ.ఓ కావడం, రీల్ ???? సినిమాలో లాగే రియల్ సినిమాలో కూడా జర్నలిస్టులు పక్కా ప్రణాళికతో చావు దెబ్బ కొడతారని ఇప్పటికే ఎఎస్పీ సంఘటన ఋజువు చేయగా... మరి ఆ ఐ.పి.ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోందని ఉత్కంఠ.

(2) శనివారం ఆ ఊరిలో పాలు పితకరు....
పాలల్లో నీళ్లు పోసి సొమ్ము చేసుకొంటున్న రోజులివి. లేగదూడకు కూడా పాలు వదలకుండా కనికరం చూపకుండా గేదె, ఆవు పొదుగు నుంచి మొత్తం పిండేసుకుంటున్న వారు అనేకం. డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతున్న వేళ
ఇలాంటి ఊరు ఒకటుందని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ఇది.

అది అనంతపురం జిల్లా,
ఆ ఊరు పేరు ఎనుములదొడ్డి. పేరునుబట్టే ఈ గ్రామంలో గేదెలు అధికంగా ఉంటాయని అంచనావేయవచ్చు. ఊరి పేరుకు తగ్గట్టుగానే పాలకు కొదవ ఉండదు. పట్టణాలకు, పల్లెలకు ఈ పల్లె నుంచే పాలు వెళ్తాయి. కానీ శనివారం వస్తే మాత్రం ఊరిలో పాలకు కరవు. గ్రామస్థులే పాలప్యాకెట్ల కోసం పక్క పల్లెలకు పరుగులు తీస్తారు. ఎందుకంటే.. శనివారం పాలన్నీ లేగదూడలకే..! వాటికి ఆ రోజు పండగే.  కడుపునిండా పాలు తాగుతాయి. ఈ ఊరి ఆచార.. సంప్రదాయాలు భిన్నం. అభినందనీయం.
(3) ప్రమాద ఘంటికలు! 
ఈ ఏడాది 443 కుష్ఠు కేసులు గుర్తింపు 
అప్రమత్తమైన అధికార యంత్రాంగం 
ఈ నెల 30 నుంచి పక్షోత్సవాలు 
కుష్ఠువ్యాధి అంతరించిపోయిందనుకున్న తరుణంలో మళ్లీ వ్యాధి లక్షణాలతో బాధ పడుతున్నవారి కేసులు నమోదవుతుండడంతో వైద్య,ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది.

ఆకర్షణీయమైన శీర్శికలు: ఆస్తి కోసం తమ్ముళ్లు, తండ్రిని మట్టుబెట్టిన యువకుడు  'అన్న'ంత పనీ చేశాడు!

నేరగొండ.. విస్తరిస్తున్న విష సంస్కృతి!

వేటూరి జయంతి సందర్భంగా సాహితీ బిడ్డ... నిను మరువదు గోదారి గడ్డ

తగరంపూడి వంతెన నిర్మాణంపై ఇచ్చిన
గుప్పిట్లో ప్రాణాలు.. గుబులుగా రైతులు

బడ్జెట్ వార్తలు:
ఆ‘కర్షక’ పద్దు..!

బడ్జెట్‌ ‘మధ్య’నాభం..!

కొసమెరుపు:- ఓ ఐ.పి.ఎస్ అధికారిపై న్యాయవిచారణ ముగింపు దశలో ఉండగా... శనివారం ఊహించని విధంగా పోలీసుశాఖ వారే స్వయంగా హాజరై తమ నాటి బాధలు చెప్పుకోవడం దస్త్రాలు ఇస్తూ చెప్పడం జరిగింది. మరో ఐ.పి.ఎస్ మీద ఓ న్యాయస్థానంలో అభియోగాలు నమోదు కూడా కొనసాగుతోంది.

Related Posts