YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆసక్తికర విషయాలు నెంబర్ వన్ లో మమతా, సెకండ్ ప్లేస్ లో నితీష్, అరవింద్

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆసక్తికర విషయాలు నెంబర్ వన్ లో మమతా, సెకండ్ ప్లేస్ లో నితీష్, అరవింద్
‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో , బెస్ట్ సీఎం ర్యాంకింగ్స్ ప్రకటించారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు 10 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 9 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు. చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 5 శాతంతో ఇద్దరు ఐదో స్థానంలో ఉన్నారు.ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 4 శాతంతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 4శాతంతో ఆరో స్థానంలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ కూడా ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రం ఒడిశాలో ఆయన పాపులారిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి 3 శాతం, అసోం సీఎం శరబానంద సోనోవాల్ 3 శాతం, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 2 శాతం, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ 2 శాతం, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ 2 శాతం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2 శాతం, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ 2 శాతంతో ఉన్నారు.‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో , లోక్‌సభలో కమలం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని తేలింది. మిత్రులపై ఆధారపడితే... అది కూడా అరకొర మెజారిటీతో మాత్రమే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెబుతోంది. దీని ప్రకారం... బీజేపీ సొంతంగా 245 స్థానాలు మాత్రం గెలిచే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న ఇతర పార్టీలన్నీ కలిసి 36 స్థానాల్లో గెలవొచ్చు. వెరసి... 281 సీట్లతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 309 స్థానాలు లభిస్తాయని తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 281కి పడిపోవడం గమనార్హం. అదే సమయంలో... యూపీఏ, ఇతరుల బలం పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

Related Posts