YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

5 నదులు అనుసంధానం చేస్తాం సీఎం చంద్రబాబునాయుడు

5 నదులు అనుసంధానం చేస్తాం               సీఎం చంద్రబాబునాయుడు
 ఐదు నదులు అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి కూనవరంలో 275.2 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.  ధవళేశ్వరం 13,37,905 క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తోందన్నారు. 15 గ్రామాలు, 10మండలాలు., ఏలూరు, కొవ్వూరు , కుక్కునూరు లలో 6వేల మందిని శిబిరాలకు తరలించామన్నారు. అమలాపురం., రంపచోడవరం., రాజమహేంద్ర వరంలలో 2వేల మందిని తరలించామన్నారు. గోదావరి., వంశధార., నాగావళి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఎర్ర కాల్వకు జంగరెడ్డి గూడెంలో గండిపడిందన్నారు. వంతెన కూలిపోయిందని, దానిని రిస్టోర్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. భద్రాచలం వద్ద జాతీయ రహదారి పాడైందని, దానిని బాగు చేస్తున్నామన్నారు. తూర్పు., పశ్చిమ., కృష్ణా., విశాఖలలో బాగా వర్షాలు పడ్డాయన్నారు. కంచికచర్ల., జగ్గయ్యపేట., పెనుగంచి ప్రోలులో బాగా వర్షాలు పడ్డాయన్నారు. బుగ్గమంగమ్మ ఆలయం వద్ద చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కాపాడామన్నారు. అత్యవసర వస్తువులు., మందులు అందుబాటులో ఉంచామన్నారు. రిలీఫ్ కమిషనర్ స్వయంగా పనుల్ని పరిశీలిస్తున్నారన్నారు. నష్టం వివరాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి పంపుతున్నామన్నారు. నాలుగు జిల్లాల్లో ఎక్కువగా నష్టం ఉందన్నారు. ఏపీలో పడిన వర్షాలు., పైనుంచి పడిన వర్షాల వల్ల ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకోవడంతో పాటు నష్టాన్ని తగ్గించడం., ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. రేపు కూడా వర్షాలు ఉంటాయన్నారు.  ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. కేరళలో జరిగిన నష్టంపై మానవతా దృక్పథంతో స్పందిస్తున్నామన్నారు. మే నుంచి 400మందికి పైగా చనిపోయారన్నారు. 40లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఏడు లక్షల 50వేల మంది వరద వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్రం కూడా బాగా స్పందించాలన్నారు.అందరూ స్పందించి కేరళ ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. త్వరలో కేరళాకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపి సంఘీభావం తెలియ చేస్తామన్నారు. కేంద్రం 600కోట్ల మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. దీనికి మించిన జాతీయ విపత్తు ఏమి ఉండదన్నారు. ఒక రాష్ట్రంలో 80శాతం అతలాకుతలం అయితే ఐదారు వందల కోట్ల విరాళం ప్రకటించి ఊరుకోవడం సరికాదన్నారు. అన్ని విధాలుగా అండగా ఉన్నామనే భావన కల్పించాల్సి బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. అందరికంటే ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 61,219కోట్లు మాత్రమే 14వ ఆర్ధిక సంఘంలో పంచిపెట్టారన్నారు. ఇది సరిపోదని, కర్ణాటకను కూడా కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. హుద్ హుద్ వచ్చినపుడు వెయ్యి కోట్లు ప్రకటించి రూ.650కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఇది పద్ధతి కాదని, ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో క్లారిటీ ఉండాలని అన్నారు. మొక్కుబడి సాయం సరికాదన్నారు. కేరళతో అంతా ఉన్నామనే భావన వారికి భరోసా ఇవ్వాలన్నారు. ఇప్పటికి 10కోట్ల సాయం., 12 బోట్లు ., ఎన్డీఆర్ బృందాలను పంపామన్నారు. కేరళ సీఎంతో రెండు సార్లు మాట్లాడానని, రైస్ కావాలని అడిగారని అన్నారు. రాష్ట్రంలో చాలామంది ఉదారంగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నామన్నారు. ఐఏఎస్., ఐపిఎస్., ఐఎఫ్ఎస్ లు ఉద్యోగులంతా కలిసి 24కోట్ల రుపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. ఏపీ జేఏసీ ఉద్యోగులు ., పెన్షనర్ల తరపున 24 కోట్ల రుపాయల విరాళం, సచివాలయ ఉద్యోగులు 25లక్షలు పోలీసులు అధికారుల సంఘం తరపున 7 కోట్లు. టీడీపీ పార్టీ ఎంపీలు ఒక నెల విరాళం., 21మంది ఎంపీల తరపున 2కోట్లా పది లక్షలు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇవ్వనున్నారన్నారు. ఎమ్మెల్యేలు., ఎమ్మెల్సీల తరపున రూ. 17లక్షల 16వేలు, కేరళకు 2వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. దాదాపు 6కోట్ల రుపాయల విలువ చేసే బియ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 50కోట్ల రుపాయల సాయం అందిస్తున్నామన్నారు. ప్రకాశం నుంచి 56శాతం వర్షాభావం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల పరిస్థితి మెరుగైందన్నారు. 670 మండలాల్లో 111 అధికమన్నారు. 258 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉందని, సాగు నీటి కోసం 56వేల కోట్లను నాలుగేళ్లలో ఖర్చు చేశామని  సీఎం తెలిపారు.  నీరుప్రగతి., ఇరిగేష్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేశాము. తొమ్మిది ప్రాజెక్టులు నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఖర్చు చేశామన్నారు. ప్రారంభానికి సిద్ధంగా ఆరు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. 29 జూన్‌కు సిద్ధం అవుతాయన్నారు. ఇంకో 13 ప్రాజెక్టులు చేపట్టామని, వీటిని పూర్తి చేయడానికి 33,760 కోట్లు అవసరని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 90వేల కోట్ల ఖర్చులో వైకుంఠపురం బ్యారేజీ నుంచి గోదావరి నుంచి పెన్నా కు 6వేల కోట్ల తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం వెల్లడించారు. పోలవరం మీద తీసుకున్న నిర్ణయాల వల్ల 57.55శాతం పనులు ఇప్పటికే పూర్తి చేయగలిగామని, కేంద్రం నుంచి 2626 కోట్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు. డిపిఆర్ అమోదించాల్సి ఉందన్నారు. ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందన్నారు. వంశధార ఫేజ్ 1., ఫేజ్ 2 విషయంలో ప్రజల్లో ఎన్నో అనుమానాల వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడిందన్నారు. డబ్బులు ఇవ్వనందుకు అక్కడ పరికరాలు దగ్ధం చేశారన్నారు. 1950లో ఒడిశా నుంచి వచ్చిన వారికి మరో స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు. వంశధార., నాగావళిలలో నీరు వృథాగా సముద్రంలోకి పోయేదని, రెండు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామని అన్నారు. శ్రీకాకుళంలో అన్ని ప్రాజెక్టులు పూర్తైతే 8లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. అక్కడ వలసలు ఉండవని,. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు పుష్కలంగా నీటిని ఇవ్వగలిగామని, పట్టిసీమ సిరులు కురిపించే సీమగా తయారు అయ్యిందని సంతోషం వ్యక్తంచేశారు. వంశధార-నాగావళి,  గోదావరి -పెన్నా నదులను అనుసంధానం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అయిదు నదులు వంశధార-నాగావళి-గోదావరి-పెన్నా-కృష్ణాలను అనుసంధానిస్తామన్నారు. పూలసుబ్బయ్య- వెలిగొండ ద్వారా ఒక టన్నెల్ పూర్తి చేసి నీటిని జనవరి నాటికి అందిస్తాము. గాలేరు-నగరి సుజల స్రవంతి ద్వారా కడపలో గండికోట వరకు నీరు వస్తుంది. కోడూరు-తిరుపతి వరకు నీటిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాము హంద్రినీవా ఫేజ్ 1 స్టేజ్ 2లో పనులు పూర్తి చేశామన్నారు. మడకశిర., కుప్పం వరకు నీటిని తీసుకువెళుతున్నామన్నారు. ఏలేరుకు చరిత్రలో మొదటిసారి పురుషోత్త పట్నం ద్వారా 24 టిఎంసిల నీటిని తరలించామన్నారు. చిత్రావతి నుంచి పులివెందులలో అన్ని మండలాలకు నీరు ఇచ్చామన్నారు. 5వేల క్యూసెక్కుల నీటి తరలింపు కోసం కొండవీటి వాగు లిప్ట్ సిద్ధం అయ్యిందన్నారు. వైకుంఠపురంకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామన్నారు. ప్రాజెక్టులన్ని పూర్తైతే రెండు కోట్ల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కోటి ఎకరాలకు హార్టి కల్చర్., కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ లో నీటిని ఇవ్వాలని ఆలోచిస్తున్నాన్నారు. రాష్ట్రంలో సమగ్ర జల విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది కంటే 400 టిఎంసీల నీటిని అదనంగా నిల్వ చేస్తున్నామన్నారు. కృష్ణా డెల్టాకు సకాలంలో నీటిని ఇచ్చామన్నారు. గోదావరి డెల్టాలో జూన్ 1నాటికే నాట్లు వేయించాము. కష్టపడి ఈ ఫలితాలు సాధించాము. వెంకటేశ్వరరావు పేరును పద్మశ్రీకి సిఫార్సు చేశామన్నారు. వాళ్లు అధికారులకు ఇవ్వమన్నారని సీఎం తెలిపారు. వెంకటేశ్వరరావు పేరును చరిత్ర గుర్తు పెట్టుకుంటుందన్నారు. టీం మొత్తం అద్భుతంగా పనిచేశారని సీఎం కొనియాడారు. ప్రతి ప్రాజెక్టును సమీక్షించి పనిచేయించుకున్నామన్నారు. కేంద్రం సహకరించకున్నా పోలవరం ఆగదన్నారు.

Related Posts