- భారత రైల్వే సీఈఎన్ 01/2018తో కొత్త నోటిఫికేషన్ విడుదల
భారత రైల్వే విడుదల చేసిన అతిపెద్ద నోటిఫికేషన్లలో ఇది ఒకటి కావడంతో ఉద్యోగార్థులకు ఇదోక సువర్ణాకాశం. ముఖ్యంగా పదో తరగతి, ఐటీఐ డిప్లోమా చేసినవారికి పెద్ద అవకాశమనే చెప్పాలి.
అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నిషియన్ పోస్టుల కోసం 21 రైల్వే రిక్ర్యూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ)లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నిషియన్ పోస్టుల్లో మొత్తం 26502 ఖాళీలు ఉన్నాయి. అందులో అసిస్టెంట్ లోకో పైలట్లకు 17,673 ఖాళీలు ఉండగా, టెక్నిషియన్ గ్రేడ్-3కు మాత్రమే 8,829 ఖాళీలు ఉన్నాయి.
ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈ నియామక ప్రక్రియకు ఫిబ్రవరి, 3, 2018 నుంచి మార్చి 5, 2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
అసిస్టెంట్ లోకో పైలట్: 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐలో (అర్మేచర్, కాయిల్ వైండర్/ ఎలక్ట్రీషీయన్/ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఫిట్టర్/హీట్ ఇంజిన్/ఇన్స్‌ట్రూమెంట్ మెకానిక్/మెకానిస్ట్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ మోటార్ వెహికల్/ మిల్ల్‌రైట్ మెయింట్‌నెన్స్ మెకానిక్/ మెకానిక్ రేడియో & టీవీ/రీఫ్రీజిరేషన్ అండ్ ఎయిర్-కండిషినింగ్ మెకానిక్/ ట్రాక్టర్ మెకానిక్/ టర్నర్/ వైర్‌మెన్ వంటి పలు శ్రేణుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎఎల్‌ఎఫ్ పోస్టు: డిప్లోమాలో ఉత్తీర్ణత సాధించినవారు మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లేదా ఇంజినీరింగ్‌లో వివిధ శ్రేణుల్లో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వీరికి 18ఏళ్ల వయస్సు నుంచి 28ఏళ్ల వయస్సు వరకు ఉండాలి.
టెక్నికల్ గ్రేడ్-111: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతితో పాటు ఐటీఐలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18కి లోబడకుండా 28ఏళ్లకు మించకుండా ఉండాలి.
పరీక్ష ఫీజు: అన్ రిజర్వ్డ్‌డ్, ఓబీసీ కేటగిరీలకు రూ.
500 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్‌సీ/ఎస్టీ/ఈఎక్స్‌స్/పీడబ్ల్యూడీ/ఫీమేల్/ట్రాన్స్‌జెండర్/మైనార్టీలు/ఈబీసీ కేటగిరీలకు చెందినవారు రూ. 250 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ తాజా నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలకై అసిస్టెంట్ లోకో పైలట్, ఎఎల్ఎఫ్ పోస్టులు లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.