ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి విజయం కోసం భారత్ మరో వికెట్ దూరంలో నిలిచింది. భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు మంగళవారం అసమాన పోరాటాన్ని ప్రదర్శించింది. బట్లర్ (106) శతకం, స్టోక్స్ (62) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడగా ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 102 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు ఇంకా 210 పరుగులు వెనకబడి ఉంది. బుమ్రాకు ఐదు, ఇషాంత్‌కు రెండు వికెట్లు దక్కాయి. క్రీజులో రషీద్ (30 బ్యాటింగ్), ఆండర్సన్ (8 బ్యాటింగ్) ఉన్నారు.