తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు గ్రూప్ జీవిత బీమా పథకానికి సంబంధించిన క్లెయిమ్ లను 24 గంటలలో చెలించినట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి ) వెల్లడించింది. రైతుబంధు పథకం కింద 5 లక్షల రూపాయిల బీమా కావేరజిని తెలంగాణ ప్రభుత్వం అందించిన సంగతి తెలిసిందే. రైతు అనుకోకుండా మరణిస్తే 5 లక్షల రూపాయిలు మొత్తాన్ని లబ్ధిదారుడు నామిని బ్యాంకు ఖాతా లో జమ వేస్తున్నారు. రైతుబంధు క్లెయిమ్ లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో పద్ధతిలో జీవిత బీమా సంస్థ సెటిల్ చేస్తుందని ఎల్ఐసి జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాధాజరు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు ఈ స్కీం కి అర్హుడు. 18 నుంచి 59 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఈ బీమా కవరేజ్ కిందకి వస్తారు.