YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర బడ్జెట్ పైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత..

కేంద్ర బడ్జెట్ పైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత..

- టీడీపీ ఎంపీలతో  సుదీర్ఘ భేటీ..

-  చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, ప్రజలు, పార్టీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన టీడీపీ ఎంపీలతో ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో యుద్ధానికి సిద్ధం కావాలని ఎంపీలకు ఆయన సూచించారు. ప్రజాభిప్రాయాన్ని సభలో చెప్పడానికి వెనుకాడవద్దని సూచించారు. ప్రజల అభిప్రాయాలు చెప్పడంలో కఠినంగా ఉండాలని చెప్పారు. సభలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సభలో సస్పెండ్ అయినా తగ్గవద్దన్నారు. సంప్రదింపులతో సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు ఎంపీలు అన్నారు.

  కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కను సుజనా చౌదరి చెప్పారు. కేంద్రం వైఖరిపై చంద్రబాబు ఆయనను అడిగి తెలుసుకున్నారు. నాలుగు బడ్జెట్‌లు చూసిన తర్వాత కూడా ఇంకా సహనం ఎక్కడ ఉంటుందని చంద్రబాబు.. సుజనను ఉద్దేశించి అన్నారు. ఏపీ ప్రస్తావన లేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం మిత్రపక్షంగానైనా గౌరవించలేదని ఆవేదన ఏపీని ప్రత్యేకంగా చూడమని తాను ఢిల్లీలోని ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రజలు ముక్తకంఠంతో దీనిపై నిరసన చెబుతున్నారన్నారు.దశల వారీగా కేంద్రంపై పోరాటం చేయాలని తెలిపారు. ఎంపీలకు సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన అసలు సమస్య కాదన్నారు. విభజన చట్టంలో పెట్టారు కాబట్టి దానిని అడుగువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నాటకాలు ఆడుతున్నారని, దీనిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు తున్నామని చెప్పారు. దానిని ప్రధానాంశంగా తీసుకొని మనం పోరాడదవద్దన్నారు. పార్టీలకు అతీతంగా బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

కాగా, చంద్రబాబు ఆదివారం ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. ఊహించని నిర్ణయం మాత్రం రాలేదు. పార్లమెంటులో మాత్రం ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడాలని, సస్పెండ్ అయినా పర్వాలేదని, తగ్గవద్దని సూచించారు. అంతకుమించిన అనూహ్య నిర్ణయం మాత్రం ఏమీ రాలేదని చెప్పవచ్చు. పొత్తుపై తాడోపేడో అన్నట్లుగా ఎంపీలు మాట్లాడారు. కానీ నిర్ణయానికి వచ్చేసరికి ఆ సీరియస్‌నెస్ కనిపించలేదు.రు. దానిని ప్రధానాంశంగా తీసుకొని మనం పోరాడదవద్దన్నారు. పార్టీలకు అతీతంగా బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 

 

 

Related Posts