విశాఖ జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న నేత గంటా శ్రీనివాసరావు. ఏ పార్టీలో ఉంటే అక్కడ తన సత్తా చాటుకుంటాడు, ఎప్పటికప్పుడు పొలిటికల్ స్కెచ్చులు వేస్తూ తన ఉనికిని చాటుకుంటూ జిల్లాలోనే తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా మారాడు. తాజాగా గంటా తన వారసున్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు పొలిటకల్ సర్కిల్‌లో ట్రెండింగ్‌గా మారింది. చంద్రబాబు సాధారణంగా వారసత్వానికి దూరంగా ఉండే వ్యక్తి.. అయితే స్వయంగా ఆయన కొడుకునే ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి ఇవ్వటంతో పార్టీలోని సీనియర్ నేతలంతా అదే ఫార్ములాలో ముందుకెళ్లాలని పావులు కదుపుతున్నారు. వీరిలో చాలా మంది ప్రముఖ నేతల పేర్లు వినిపిస్తున్న ఉత్తరాంధ్ర నుంచి గంటా తన కొడుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చక చకా పనులు పూర్తిచేస్తున్నాడు. పార్టీ కార్యకర్తలను పక్కన పెడితే సొంత క్యాడర్‌ని మెయింటేన్ చేస్తూ తనకంటూ పార్టీలో సపరేట్ వెయిట్ ఉండేలా చూసుకుంటాడు గంటా శ్రీనివాసరావు. శాసనసభ్యునిగా మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా అపార రాజకీయం అనుభవం ఉన్న గంటా ఇప్పుడు తన కొడుకు కెరియర్‌ని చక్కదిద్దడమే ప్రధానమైన పనిగా పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.తొలిసారి చోడవరం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన గంటా శ్రీనివాసరావుకి ఇప్పటికి కూడా అదే నియోజకవర్గంలో కేడర్ ప్రాభల్యం గట్టిగానే ఉంది. ఎన్నికలకో నియోజకవర్గాన్ని మారుస్తూ విశాఖ జిల్లా వ్యాప్తంగా తన ఇమేజ్‌ని విస్తరించుకున్నాడు గంటా.. అయితే ఈసారి తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన చోడవరం నుంచి కుమారుడు జయదేవ్‌ని కూడా శాసనసభకు పంపాలని ఉవ్విళ్లూరుతున్నట్టు పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇటీవలే జయదేవ్ చిత్రంతో స్విలర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని చెక్ చేసుకున్న జయదేవ్ సినిమా పరాజయం పాలవడంతో తిరిగి పాలిటిక్స్ వైపు దృష్టిసారించాలనుకుంటున్నాడట.. అందుకు గంటా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది..అయితే ఈ విషయం బయట పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతున్నప్పటికి అఫిసియల్‌గా అయితే గంటా జయదేవ్ ఎటువంటి కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం లేదు. గంటా శ్రీనివాసరావు కూడా వయసు మీదపడో..రాజకీయాల నుండి గ్యాప్ కోరుకునో పక్కకు తప్పుకునే టైప్ కాదు. పైగా ఇప్పడు గంటా మరింత యాక్టీవ్‌గా పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తండ్రికి సంభందించిన వ్వాపర వ్వవహారాల్లో బిజీగా ఉన్నాట్లు తెలుస్తుంది.