ఎదురు చూసిన ఫలితం రానేవచ్చింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో తొలి విజయం అందుకుంది. మూడో టెస్టులో ఆతిథ్య జట్టును 203 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. లార్డ్స్ టెస్టుకు కసిగా ప్రతీకారం తీర్చుకుంది. విమర్శకుల కరకు మాటలకు ధీటుగా బదులిచ్చింది. తమపై నమ్మకం కోల్పోవద్దని అభిమానులను కోరిన విరాట్ కోహ్లీ తన మాట నిలబెట్టుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. ఆటగాళ్లు, అభిమానుల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. మ్యాచ్ మొదలైన 10నిమిషాల్లోనే అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో అండర్సన్ పెవిలియన్ బాట పట్టాడు. మ్యాచ్ ముగిసే సమయానికి అండర్సన్(11), రషీద్(33) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బూమ్రాకు 5వికెట్లు, ఇషాంత్ శర్మకు 2, అశ్విన్‌కు 1, మహ్మద్ షమీకి 1, హార్థిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. అయిదు టెస్ట్‌ల సీరిస్‌లో ఇంగ్లండ్ 2, ఇండియా 1 టెస్ట్ గెలిచాయి.