YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వే మంత్రితో ఎంపీ వినోద్ భేటీ

రైల్వే మంత్రితో ఎంపీ వినోద్ భేటీ
రైల్వే శాఖ పెండింగ్ పనులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ని  ఎంపి వినోద్ బుధవారం కలిసారు. రాష్ట్రంలో రైల్వే శాఖ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న అనేక అంశాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తో చర్చించారు.  కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పలు స్టేషన్ల లో పలు రైళ్ల నిలుపుదలపై  చర్చ జరిపారు.  గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, సౌత్ సెంట్రల్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ స్పందించడం లేదని కేంద్ర మంత్రికి వివరించారు.  గత బడ్జెట్ లో కొత్త లైన్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మరమ్మత్తులకు నిధులు కేటాయించినా పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదని వినోద్ కేంద్ర మంత్రికి వివరించారు.  పనుల విషయంలో దృష్టి సారించాలని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ని  కోరారు. హుజరాబాద్ మీదుగా కరీంనగర్ - కాజీపేట కొత్త రైల్వే లైన్ వేయాలని, ఈ సంవత్సరం డిసెంబర్ లో ప్రవేశపెట్టనున్న సప్లమెంటరీ బడ్జెట్ లో ఈ రైల్వే లైన్ కు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి గుర్తు చేసారు.  ప్రస్తుతం ముంబాయి - నిజామాబాద్ వరకు నడుస్తున్న లోక్ మన్య తిలక్ రైల్ ను కరీంనగర్ వరకు పొడగించాలని కేంద్ర మంత్రిని కోరారు. మున్సిపాలిటీలు, మేజర్ పట్టణాలు అయిన మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ నుంచి రోజు వేలాది మంది బస్సులో ముంబాయి వెళ్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. కరీంనగర్ నుంచి తిరుపతికి రోజు వారి రైల్ ను నడిపించాలని, ప్రస్తుతం కరీంనగర్ నుంచి వారానికి రెండు సార్లు మాత్రమే ట్రైన్ నడపడం వల్ల అనేక మంది తిరుపతి కి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వినోద్ అన్నారు.  ధనపూర్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ - నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ లను జమ్మికుంటలో, సికింద్రాబాద్ - కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలపాలని కేంద్ర మంత్రిని కోరారు.  సెప్టెంబర్ 27 న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్  వినోద్ యాదవ్ తో భేటి కానున్నట్లు యన తెలిపారు. 

Related Posts