వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో 7.6 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్టు 26 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయువ్య మధ్య ప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు ఉదయం బలహీనంగా మారింది. ఉత్తర మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో 4.5 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్నిచోట్ల, రేపు ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడురోజులు కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల ముడురోజులు రాయలసీమలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.