ఈ దేశంలోనే కాదు,బహుసా ఈ ప్రపంచంలోనే ఇలాంటి ప్రతిపక్షం ఉండదేమో. రెండేళ్ళ నుంచి అసెంబ్లీ మొఖం చూడలేదు, ఆరు నెలల నుంచి పార్లమెంట్ కు వెళ్ళలేదు. వీళ్ళు మన ప్రతిపక్షం. వీళ్ళు ప్రజల సమస్యల తరుపున పోరాడేది. ఏది అడిగినా, నేను ముఖ్యమంత్రి అయిన తరువాతే అని చెప్పే వాడు, మన ప్రతిపక్ష నాయకుడు. ఇవన్నీ జరుగుతూ ఉండాగానే, ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది.ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ హాజరుకావాలని స్పీకర్, జగన్ను కోరే అవకాశం ఉంది. అయితే సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జగన్ మాత్రం ఈ సారి కూడా ససేమీరా అంటున్నట్టు సమాచారం. జగన్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అంటూ, వైసీపీ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మల్యేలకు ఆదేశాలు జారీ చేసేంది... కీలకమైన ఎన్నికల సంవత్సరంలో జరిగే సమావేశాలు అయినా వెళ్ళద్దు అని చెప్పేశారు... అయితే, పజ్రల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటే విమర్శలు వస్తున్న తరుణంలో, వైసీపీ ఎమ్మల్యేలు ప్రజా వ్యతిరేకత వస్తుంది అనే భయంలో ఉన్నారు...అయితే కొంత మంది ఎమ్మల్యేలు, విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్లి, జగన్ నిర్ణయం మార్చుకోమని వేడుకున్నారు... అసెంబ్లీకి రాకుండా రోడ్లు మీద స్టేజి షోలు చేస్తుంటే, ప్రజలు ఎలా నమ్ముతారని వారు విజయసాయిని ప్రశ్నించారు...దానికి విజయసాయి వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు... జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, అది శాసనం అని మీకు తెలియదా ? కొత్తగా ఇలా వచ్చి నన్ను అడుగుతారేంటి ? అయినా ఇలాంటి వాటితో మనకి పని లేదు... అసెంబ్లీకి వెళ్ళినా,మిమ్మల్ని చంద్రబాబు ఆడుకుంటారు... అయినా ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు.. మనం అధికారంలోకి వస్తున్నాం.. జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం... అన్నీ అనుకూలిస్తే, నేను కేంద్ర మంత్రిని అవుతాను... మీలో కూడా మంత్రులు అవ్వచ్చు... భయాలు పెట్టుకోవద్దు.... జగన్ ను నమ్ముకోంది, అని వారిని తిప్పి పంపించి వేసారు...