YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలంలో పెరుగుతున్న వరదనీరు

 శ్రీశైలంలో పెరుగుతున్న వరదనీరు
శ్రీశైలం డ్యామ్ కు  వరదనీరు పెరుగుతోంది.  ఇన్ ఫ్లోస్ పెరగడంతో అధికారులు 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నారు. 1,91,709 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. డ్యామ్ కు మొత్తం ఇన్ ఫ్లో  : 2,62,739 క్యూసెక్కులు కాగా, మొత్తం అవుట్ ఫ్లో : 2,94,239 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885  అడుగులు. బుధవారం ఉదయానికి నీటిమట్టం :  883.50 అడుగులు. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం  : 215 టీఎంసీలు. జలాశయంలో ప్రస్తుతం : 207.4103 టీఎంసీలు నమోదయ్యాయి.  శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Related Posts