YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

'గుండె' పదిలానికి రెడ్ వైన్ ' స్టెంట్ '

 'గుండె' పదిలానికి రెడ్ వైన్ ' స్టెంట్ '

ఓ గ్లాసు రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నది నిపుణుల మాట. అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గిస్తాయి. అందుకే హృద్రోగ సంబంధ వ్యాధులు ఉన్నవారికి వైద్యులు రెడ్‌ వైన్‌ రోజూ కొద్ది మోతాదులో తాగాలని సిఫారసు చేస్తుంటారు. తాజాగా, అమెరికాలోని లూసియానా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు రెడ్‌వైన్‌ యాంటీ ఆక్సిడెంట్లు విడుదల చేసే స్టెంట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టెంట్లు కీమోథెరపీ ఏజెంట్లను విడుదల చేస్తాయి. అవి విషపూరితమైనవి. వాటితో భవిష్యత్తులో రక్తనాళం కుచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే, రక్తం గడ్డకట్టకుండా, సరఫరా సాఫీగా జరిగేలా చేసే రెడ్‌వైన్‌ స్టెంట్లను పరిశోధకులు తయారుచేస్తున్నారు.

Related Posts