తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలా శివప్రసాద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వరద, తుఫానుతో అతలకుతం అయిన కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని స్వామి వారిని కోడెల ప్రార్థించానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేరళకు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కూడా కేరళకు తమ వంతు సహకారం అందింస్తున్నాం అని కోడెల తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి వర్షాకాల, శీతాకాల సమావేశాలు సంయుక్తంగా 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు కోడెల పేర్కొన్నారు.