కేరళలో వరదకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వితరణ చేయడానికి పంపే వస్తుసామాగ్రి, ఆహారపదార్థాను ఉచితంగా రవాణా చేయడానికి భారతీయ రైల్వే నిర్ణయించింది. కేరళలో ప్రకృతిబీభత్స ప్రాంతాల్లో సేవందించే లక్ష్యంతో కేరళ ప్రజలను ఆదుకోవడానికి ఉచితంగా రవాణా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా కేరళ వరద బాధితుల సహాయార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక తోడ్పాటుకు నడుం బిగించింది. ‘కేరళ కోసం చేతులు కలపండి’ అనే లక్ష్యంతో కేరళలో వరద సంక్షోభంలో చిక్కిఅల్లాడుతున్న ప్రజకు తనవంతు తోడ్పాటు అందించడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ చొరవ తీసుకొని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ వరద బాధితుల సహాయార్ధం నడుంబిగించారు. వరదబాధితుల ఉపశమనం కల్గించే చర్యను కేరళ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొంటూ బాధ్యతను నిర్వర్తించడానికి అదనపు జనరల్ మేనేజర్ శ్రీ జాన్ ధామస్ ని నియమించారు.
జోన్లోని డివిజన్ స్థాయిలో ప్రతి విభాగం నుండి సహాయబృందాలను ఏర్పాటు చేసి కేరళ వరద బాధితులకు సహాయార్థం ఆహారపదార్థాలను అందించేందుకు సన్నాహాలు చేశారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు మరియు 6 డివిజన్ల (సికింద్రాబాద్, హైద్రాబాద్, విజయవాడ, నాందేడు, గంతకల్లు మరియు గుంటూర్) డిఆర్ఎరు కూడా వారి స్థాయిలో ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం, కార్మిక సంఘాలు కూడా తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి రంగంలోకి దిగాయి. రెండు రోజుల వ్యవధిలోనే జోన్ 60 టన్నుల ఆహార, వస్తు సామగ్రిని సమీకరించి అన్ని ప్రధాన స్టేషన్ల ద్వారా వరద బాధిత ప్రాంతాలకు చెందిన జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకొని పంపించారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సామాగ్రి, శానిటరీ నాప్కిన్స్, మస్కిటోకాయిల్ లు ప్రత్యేకంగా గుర్తువేసి ఎస్ఎల్ఆర్ (గేజ్ కం బ్రేక్వ్యాన్) కోచ్ను జోన్ కేంద్రం పంపించింది. విజయవాడ నుండి 24 టన్నుల సహాయ సామాగ్రిని, ప్రత్యేక పార్సిల్ వ్యాన్లో పంపించారు. అలాగే తిరుపతి స్టేషన్ నుండి 16 టన్నుల సామాగ్రిని పంపించారు. ఇంకా కావసిన ఏ సహాయసహకారాలైనా ఏసమయంలోనైనా అందించడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధంగా ఉందని తెలిపింది.