జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన ప్రచారం కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించారు. హైదరాబాద్‌లో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వాహనంలో కొద్దిమందితో కూర్చుని సమావేశం కావచ్చు. వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు ఆయనకు కొంత స్థలం ఇందులో కేటాయించారు. ఈ వాహనంలోనే స్పీకర్లు, సౌండ్‌కు సంబంధించిన వ్యవస్థ ఉంది. ఒక వేళ ఎక్కడయినా వెలుతురు సరిగా లేని పరిస్థితుల్లో అందుకు ప్రత్యామ్నాయంగా వెలుగులు పంచే ఏర్పాటు కూడా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మలి విడత పర్యటన ప్రారంభం కానుంది. ఆ పర్యటన నాటికీ ఈ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.మరికొన్ని రోజుల్లో జనసేనానికి ఇది అందుబాటులోకి వస్తుంది. కారవాన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రముఖులతో సమావేశాలు జరుపుకోవచ్చు. కావాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. టీవీ, ఇంటర్నెట్ లాంటి సకల సౌకర్యాలు ఈ ప్రచార రధంలో ఉన్నాయి.ప్రస్తుతం ఏపీ రాజకీయ నాయకుల్లో అత్యంత ఖరీదైన ఇలాంటి వాహనం ప్రభుత్వం వద్ద ఉంది. ఎప్పుడన్నా పర్యటనలు చెయ్యటానికి చంద్రబాబు దీని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాహనం తర్వాత సకల హంగులు సంతరించుకున్న ఇసుజు కంపెనీకి చెందిన ఫుల్లీ-లోడెడ్ వాహనం ఇదే.వైఎస్ఆర్సీ అధినేత జగన్ వద్ద కూడా ఇలాంటి ఓ వాహనం ఉన్నప్పటికీ, అది కాస్త పాతది. జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు చాటిచెప్పేలా ఈ బస్సుపై పోస్టర్లు అతికించారు. ఇకపై తన పర్యటనల్లో ఈ బస్సుపై నుంచే పవన్ ప్రసంగిస్తారు. అయితే ఈ బస్సు ఖరీదు 5 కోట్లుగా తెలుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పే పవన్ కళ్యాణ్, డబ్బులు లేక, కార్ కిస్తీ కట్టలేక అమ్మేసాను అని చెప్ప పవన్ కళ్యాణ్, ఇంత ఖరీదు పెట్టి, ఇలాంటి బస్సు కొనటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇప్పటికే హైదరాబద్ లో రెండు పెద్ద ఆఫీస్ లు తీసుకున్నారు. విజయవాడలో రెండు ఎకరాల్లో ఇల్లు, పార్టీ ఆఫీస్, మళ్ళీ ఇది కాక, పటమటలో , రెండు లక్షల పెట్టి అద్దెకు ఒక ఇల్లు, ఇలా అనేక విధాలుగా ఈ మధ్య పవన్ ఖర్చు పెడుతున్నారు