
సోమవారం గవర్నర్ నరసింహన్‌ను పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులతో కలసి గవర్నర్‌తో కృష్ణారావు సమావేశంకానున్నారు. ఏపీలో కాపులను బీసీల్లో చేర్చితే ఓబీసీలకు జరిగే నష్టాన్ని గవర్నర్‌కు వివరించనున్నారు. అంతే కాకుండా రేపు జనసేన అధినేత పవన్‌తో కూడా కృష్ణారావు భేటీకానున్నారు. ఏపీలోని మత్స్యకారుల స్థితిగతులపై చర్చించనున్నారు.