పశ్చిమ గోదావరి జిల్లా లోని ఎర్ర కాలువ జలాశయానికి వరద తాకిడి పెరిగింది. దాంతొ 5 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. గత వారంరోజులుగా ఎర్ర కాలువ ముంపులోనే నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు మండలాల్లోని వేలాది ఎకరాల పంట పొలాలు, పలు గ్రామాలు వుండిపోయాయి. భీమవరం వద్ద యనమదుర్రు డ్రైన్ ప్రమాదభరితంగా ప్రవహిస్తుంది. భీమవరంలో పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గోదావరి వరద నీటిలో లంక గ్రామాలు వున్నాయి. ఐదురోజులుగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి వరద నీరు చుట్టుముట్టడంతో పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్, కాంక్రీట్ పనులను కాంట్రాక్టు సంస్థలు పూర్తిగా నిలిపివేసాయి.