YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఓటర్ల జాబితాల అవగాహనా సమావేశాలు

 ఓటర్ల జాబితాల అవగాహనా సమావేశాలు

- జిల్లాలలో మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యములోని కమిటీ పర్యటన 

తెలంగాణ  రాష్ట్రములోని 83 గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రజలలో మరియు కాంగ్రెస్ కార్యకర్తల్లో అవగాహనా కల్పించడానికి  శ్రీ  మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వములోని పి.సి.సి. ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ రేపటి ( 5 ఫిబ్రవరి) నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు జిల్లాలలో పర్యటించి జిల్లా కాంగ్రెస్ కమిటీల  ఆధ్వర్యములో జరిగే ఓటర్ల జాబితా సవరణల అవగాహన సమావేశములలో పాల్గొన నున్నది. ఈ పర్యటనలలో శ్రీ  మర్రి  శశిధర్ రెడ్డి తో పాటు కమిటీ సభ్యులు శ్రీ జి.నిరంజన్ , శ్రీ  బి.కమలాకర్ రావు , శ్రీ  ఎ.శ్యామ్ మోహన్ , శ్రీ  అబిద్ రసూల్ ఖాన్, శ్రీ .ఎం.ఆర్.జి .వినోద్ రెడ్డి, శ్రీమతి ప్రేమలత అగర్వాల్,  శ్రీ తన్నీరు నరేందర్ , శ్రీ  పి .రాజేష్ తదితరులు పాల్గొంటారు.

పర్యటన వివరాలు  ఈ నెల  5  వ తేదీ ,ఉదయం 11 గంటలకు  నిజామాబాదు., మధ్యాహ్నం  3  గంటలకు అదిలాబాద్,6 వతేదీ,   మధ్యాహ్నం   3  గంటలకు కరీంనగర్, ఈ నెల 7వ తేదీ ,ఉదయం    11 గంటలకు  వరంగల్.,  మధ్యాహ్నం   3  గంటలకు   ఖమ్మం,  8 వ తేదీ ,ఉదయం ,11  గంటలకు  నల్గొండ., సాయంత్రం   4  గంటలకు   రంగా రెడ్డి , 9 వ తేదీ ,ఉదయం   11  గంటలకు  మెదక్,  10 వ తేదీ ,ఉదయం  11  గంటలకు   మహబూబ్ నగర్లలో కొనసాగుతాయి.

 

Related Posts