ప్రధాని నరేంద్ర మోడీకి జోడెద్దులుగా పవన్, జగన్ మారారు. రాజకీయ పరణితి లేకే జగన్ పెళ్లిళ్లు గురించి మాట్లాడుతున్నారు. 1982 తర్వాత దేశంలో ఎన్నో పొత్తులు కుదిరాయని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకపార్టీ పాలన ముగిశాక ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు ఎన్నో వచ్చాయి. కాంగ్రెస్ గతంలో టిఆర్ఎస్., సిపిఎం., సిపిఐలతో జత కట్టలేదా అని అయన అడిగారు. ఇప్పుడు టిఆర్ఎస్-బీజేపీల గురించి జగన్ ఎందుకు మాట్లడరు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్కు ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని అన్నారు. అడగకుండానే రాంనాథ్ కోవింద్కు, వెంకయ్యనాయుడు ఎందుకు మద్దతు ఇచ్చారు. అవి పెళ్లిళ్లు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా బీజేపీతో కలిసి ఎందుకు నడుస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన వారితోనే కలిసి ముందుకెళతామని., ఇప్పుడు ఇవ్వమంటోన్న బీజేపీతో ఎందుకు వెళుతున్నారని నిలదీసారు. దేశంలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది. మోదీ హవా వచ్చే ఎన్నికల్లో ఉండదని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పీడీ అకౌంట్లను నిర్వహిస్తున్నారు. పీడీ అకౌంట్లపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు. శాఖల ఫైనాన్షియల్ నిర్వహణ కోసమే వీటిని నిర్వహిస్తున్నారు. పీడీ అకౌంట్లలో అవినీతి జరిగే అవకాశమే లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా పీడీ అకౌంట్లు ఉన్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలలో కూడా పీడీ అకౌంట్లు ఉన్నాయి. అక్కడి ఖాతాలపై కూడా సీబీఐ విచారణ వేయాలని జీవిఎల్ కోరగలరా అని అయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేసి కేంద్రం పాలన సాగిస్తోందని అయన విమర్శించారు.