YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనం, నేదురుమల్లికి పార్టీ మార్పుకు రంగం సిద్ధం

ఆనం, నేదురుమల్లికి పార్టీ మార్పుకు రంగం సిద్ధం
గత కొన్నాళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తల్లో వినిపిస్తున్న పేర్లు ఆనం రామనారాయణ రెడ్డి, నేదురుమల్లి రామ్‌ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వీరిద్దరూ వేర్వేరుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. గతంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ నేతలని వేరే చెప్పనక్కర్లేదు. అయితే కొన్నాళ్ల కిందట ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలోకి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి చేరారు. కానీ ఆ పార్టీల్లో వీరు ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజులూ ముహూర్తాలు బాగోలేవని ఈ నేతలు ఆగినట్టుగా వార్తలు వచ్చాయి. ఆషాడంలో వీరు వైసీపీలో చేరికుండా.. శ్రావణం వరకూ ఆగారు. ఇప్పటికే శ్రావణ మాసం రానే వచ్చింది వీరిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే లాంఛనాన్ని పూర్తి చేయబోతున్నారని సమాచారం. సెప్టెంబర్ రెండో తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంలో ఈ ఇద్దరు నేతలూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని తెలుస్తోంది. ఆ రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్‌లో పెద్ద సభను నిర్వహించాలని భావిస్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ రోజుకు వైజాగ్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ సభను నిర్వహించాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఆ సభలోనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేతలకు వైసీపీలో ఏ నియోజకవర్గాల బాధ్యతలు దక్కబోతున్నాయనేది మరో ఆసక్తిదాయకమైన అంశం

Related Posts