‘జన జాగృతి పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. మహిళా ప్రాధాన్యంగా కొత్త పార్టీ సాగుతుందని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవస్థ అవినీతిమయం అయిందని.. నారా లోకేశ్‌కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల దేవాలయమైన అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. కులాధిపత్యంతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని గీత ఆరోపించారు. జనజాగృతి పార్టీ మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తుందని ఆమె స్పష్టంచేశారు. ఆర్నెల్లకు ఓసారి ఎమ్మెల్యేలపై సామాజిక ఆడిట్ చేయిస్తామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పించిన అనంతరం ఈరోజు రాజకీయ పార్టీ పెట్టానని గీత వివరించారు.