- మత్స్యకారులు పండగా చేసుకున్నారు..
విశాఖపట్నం మండలంలోని రాజయ్యపేట మత్స్యకారులకు భారీ సొర చేప దొరికింది. శనివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన మత్స్యకారులు బోట్లపై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేట సాగిస్తుండగా ఈ భారీ సొర చేప లభించింది. సుమారు పది అడుగుల పొడవు కలిగిన ఈ చేప సుమారు 125 కిలోల బరువు ఉంది. దీని వెల దాదాపు రూ.లక్షకు పైగా వుంటుందని మత్స్యకారులు చెప్పారు.
ఈ సొర చేపను విక్రయించేందుకు ప్రత్యేక వాహనంలో కేరళ రాష్ర్టానికి తరలిస్తున్నామన్నారు. ఈ చేపను చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు.