ముందస్తు హెచ్చరికతో రాజకేయ పార్టీల్లో చలనం ప్రారంభమైంది. తాజాగా లోక్‌సభ ఎన్నికలపై పోలింగ్ ఏజెన్సీ సంస్థ నేతా యాప్ కొన్ని అంచనాలను వెల్లడించింది. ఈ యాప్ ప్రజాప్రతినిధులపై ప్రజలకున్న అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత వాటిని సమీక్షించి నివేదికలు రూపొందిస్తుంటుంది. గత మూడు నెలలుగా ప్రజల్లో భాజపాకున్న విశ్వాసం సన్నగిల్లినట్లు కన్పిస్తోందని నేతా యాప్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పట్టు సాధిస్తోందని తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పుడే నిర్వహిస్తే భాజపా 70కి పైగా సీట్లు కోల్పోయే అవకాశముందని చెబుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 282 సీట్లు సాధించగా.. ఇప్పుడు ఎన్నికలొస్తే ఆ సంఖ్య 212కు తగ్గుందని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్ సంఖ్యా బలం 44 నుంచి 110కి పెరుగుతుందని నేతా యాప్ పేర్కొంది.రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉండే అవకాశముందని నేతా యాప్ సీఈవో రాబిన్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్‌వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని ఆయన అన్నారు. పాపులర్ లీడర్ రేటింగ్‌లో గెహ్లాట్‌కు 42.3శాతం ఓట్లు రాగా.. రాజేకు 33.3శాతమే వచ్చాయన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కు 42.6శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు 48.9శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు.డెహ్రాడూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రథమ్ మిత్తల్ ఈ నేతా యాప్‌ను రూపొందించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం తన అధికారిక నివాసంలో ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అధికారికంగా నిన్ననే ప్రారంభమైనప్పటికీ.. గత ఎనిమిది నెలలుగా ఈ యాప్ ప్రజల నుంచి డేటా సేకరిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ యాప్ తన అంచనాలు వెల్లడించగా.. అవి దాదాపు 90 శాతం నిజమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్‌లో 1.5కోట్ల మంది వెరిఫైడ్ ఓటర్లు తమ స్థానిక నేతలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వారికి రేటింగ్ ఇచ్చారు. 2019 నాటికి 10కోట్ల మంది యూజర్ల రేటింగ్ స్వీకరించడమే తమ లక్ష్యమని మిత్తల్ చెబుతున్నారు. ఈ యాప్ ప్రజాప్రతినిధులపై ప్రజలకున్న అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత వాటిని సమీక్షించి నివేదికలు రూపొందిస్తుంటుంది.