YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేరళకు 593 కోట్ల విరాళాలు

కేరళకు 593 కోట్ల విరాళాలు
వరదలతో అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవడానికి అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, ఉద్యోగ సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లు, వ్యాపారస్తులు... విద్యార్థులు.. ఇలా తేడాలు లేకుండా తోచిన స్థాయిలో అందరూ స్పందిస్తూ వస్తున్నారు. ఇలాంటి విరాళాల్లో కొన్ని బాధితులకు డైరెక్టుగా అందుతుండగా, మరి కొన్ని మొత్తాలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందుతున్నాయి. ఇలా అందుతున్న విరాళాల గురించి కేరళ సీఎం కార్యాలయం ఒక ప్రకటన చేసింది. నిన్నటి వరకూ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మొత్తం 539 కోట్ల రూపాయల మొత్తం విరాళాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, అనేక మంది వ్యక్తులు, వివిధ సంస్థలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలోకి జమ చేసిన మొత్తం ఇది. కేంద్రం అందించిన సాయం వేరే ఉంది. అలాగే మరి కొంతమంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు... బాధితులను ప్రత్యక్షంగా ఆదుకునేలా సహాయాలు చేస్తున్నారు. అయితే కేరళకు ఈ వరదలతో జరిగిన నష్టంతో పోలిస్తే అందిన సాయం స్వల్పమే. దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా చూసినా విరాళాలు వెయ్యి కోట్ల రూపాయల స్థాయి అందిన దాఖలాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే.. తాజాగా యూఎస్ టెక్ జెయింట్ ‘ఆపిల్’తన వంతు విరాళాన్ని ప్రకటించింది. మొత్తం ఏడు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది ఈ సంస్థకేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కొంత మొత్తాన్ని, మరి కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆపిల్ ముందుకు వచ్చింది. 

Related Posts