- ఈ ఏడాది రిటైరయ్యేవారిలో 8 మంది కేంద్ర మంత్రులు..
- బీజేపీ నుంచి 17 రాజ్యసభ సభ్యులు
-. కాంగ్రెస్ తరఫున 12 మంది
- జాబితాలో చిరంజీవి, రేణుకా చౌదరి, రాపోలు
- టీడీపీ నుంచి సీఎం రమేశ్, దేవేందర్‌గౌడ్
రాజ్యసభలో ఈ ఏడాది పార్టీల బలాబలాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 59 మంది ఎంపీల పదవీకాలం ముగియబోనుంది. వీరిలో 17 మంది బీజేపీ, 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది రిటైరయ్యేవారిలో 8 మంది కేంద్ర మంత్రులు కూడా విశేషం. అరుణ్‌జైట్లీ, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. అయితే వీరందరూ మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక సెలబ్రిటీల్లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి రేఖ తదితరులు ఉన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ తరఫున చిరంజీవి, రేణుకాచౌదరి, రాపోలు ఆనంద భాస్కర్, టీడీపీ నుంచి టి.దేవేందర్‌గౌడ్, సీఎం రమేశ్ ఉన్నారు. సీఎం రమేశ్ తిరిగి ఎంపికయ్యే పరిస్థితులు కనిపిస్తుండగా..
దేవేందర్‌గౌడ్ విషయంలో అస్పష్టత నెలకొంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం తక్కువగా ఉన్న కారణంగా కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా ఎన్నికైన చిరంజీవి, రేణుకా చౌదరి, రాపోలు ఆనంద భాస్కర్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఒకవేళ చిరుకి గనుక అవకాశం లభించకపోతే క్రియాశీలక రాజకీయాలకుదూరమై పూర్తిగా సినిమాలకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.