రాఖీ కట్టినా,కట్టకపోయనా...ఆడబిడ్డగానే గౌరవించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆదివారం నాడు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా రాఖీ సందేశాన్ని ఇచ్చారు. ‘రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరుఫున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు. సోదర ప్రేమకు ప్రతిరూపంగా.. మావన సంబంధాలను పరిపుష్టం చేసేలా రక్షా బంధన్ వేడుకలను చేసుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక ఈ వేడుక. చేతికి రాఖీ కట్టినా, కట్టకపోయినా ప్రతి ఆడబిడ్డనీ మన ఇంటి బిడ్డగానే గౌరవించుకుందాం. అక్క చెల్లెళ్ల గౌరవమర్యాదలు కాపాడి వారికి ఉజ్వల భవితకు చేయూతను అందిద్దాం’ అన్నారు పవన్ కళ్యాణ్. .