YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

మోడీ ప్రభుత్వం పైనే యుద్ధం..

 మోడీ ప్రభుత్వం పైనే  యుద్ధం..

  కేసీఆర్ ఎదుర్కోవడం సమస్య కాదు 
: సుష్మితా దేవ్  తెలంగాణాలో

 కాంగ్రెస్ పార్టీ   మహిళా జాతీయ అధ్యక్షురాలు 

రాజకీయాలలో మంత్రిగా ఉండటం వల్ల మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చు అనేది తప్పు.క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఉంది కూడా సమస్యలు పరిష్కరించవచ్చని  కాంగ్రెస్ పార్టీ  మహిళా జాతీయ అధ్యక్షురాలు: సుష్మితా దేవ్  అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన మహిళా సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు, తమ నాయకుడు రాహుల్ గాంధే జీ చెప్తారు.. మాటలు తక్కువ మాట్లాడాలి ,పని ఎక్కువ చేయాలి అని కానీ దేశం లో మాటలు ఎక్కువ పని తక్కువ జరుగుతుందన్నారు. ప్రత్రికల్లో వచ్చే వార్తల  కంటే తక్కువగా మోడీజీ ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయి.రాహుల్ గాంధీ బూత్ లెవల్ పార్టి కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మాట్లాడతారు.ఇలా ఒక్క కాంగ్రెస్ లోనే జరుగుతుందని చెప్పారు.

మనమంతా మహిళ కాంగ్రెసును ఎలా బలపరచాలి అని ఆలోచించాలన్నారు.పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశ పెట్టలేకపోతుందని పేర్కొన్నారు. జిల్లా మహిళ అధ్యక్ష్యురాళ్లు ఏదైనా మీ జిల్లాలో ఎదురయ్యే సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళలు పబ్లిక్ మీటింగులకు మాత్రమే కాకుండా,100 మంది,50 మంది మహిళా గ్రూప్ మీటింగ్ ద్వారా కూడా మన చైతన్య పరచవచ్చని ఆమె సూచించారు.  తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 30,రూపాయల చీరలు ఇస్తున్నారు.
కానీ కేసీఆర్ కూతురు కవిత మాత్రం పార్లమెంటుకు లక్షలలో విలువ చేసే చీరలు కట్టుకుంటుందన్నారు. ఈ విషయాన్ని తాను రోజు  పార్లమెంటులో కవితను  చూస్తానని సుస్మిత తెలిపారు,కేసీఆర్ తన కూతురు కవితను చేసినట్టే రాష్ట్ర మహిళలను చూడాలని డిమాండు చేసారు. మహిళలంతా ఒక్కటైతే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 


 
 

 
 

 

Related Posts