కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఏవిధంగా ఉన్నా..ఏపీలో మాత్రం ‘కాంగ్రెస్’తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.