ఆసియా క్రీడల్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ మహిళల సింగిల్స్ సెమీస్‌లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు తొలిసారి వీరు పతకాలను అందించనున్నారు. క్వార్టర్స్‌లో సింధు థాయ్‌లాండ్ క్రీడాకారిణి జిందాపోల్‌పై 21-11, 16-21, 21-14 తేడాతో విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆది నుంచి దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు.. రెండో గేమ్‌ను కొన్ని తప్పిదాలతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తనదైన షాట్లతో విజృంభించి ఆడి 21-14 తేడాతో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.