ఆసియా క్రీడల 8వ రోజున అథ్లెటిక్స్‌లో భారత ఆటగాళ్లు ముందుకు దూసుకెళ్తున్నారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆసియన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత అయిన అను రాఘవన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ఆమె తొలిసారి పతక రేసులో నిలిచింది. కేరళకు చెందిన 25 ఏళ్ల అను.. హీట్ 2లో 56.77 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. బెహరెన్‌కు చెందిన ఒలువకెమి 54.87 సెకన్లతో తొలిస్థానంలో నిలవగా, వియత్నాంకు చెందిన థిలాన్ రెండోస్థానంలో నిలిచింది. ఇక హీట్ 1లో 59.02 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి మరో భారత మహిళా అథ్లెట్ జానా ముర్ము కూడా 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్‌కి అర్హత సాధించింది.