దక్షిణ భారత టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును ఏబిఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోటార్ సైకిల్ కార్బోరేటర్ వేరియంట్ ఇప్పుడు డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ పొందింది. కార్బోరేటర్ వేరియంట్లో ఏబిఎస్ వచ్చిన తొలి మోడల్ కూడా ఇదే. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఏబిఎస్ వెర్షన్ ధర రూ. 1.07 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కొత్తగా విడుదలైన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో కొత్త తరం డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. గరుకు మరియు జారుడు స్వభావం ఉన్న అన్ని రోడ్ల కోసం టీవీఎస్ బృందం ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్‌ను స్వయంగా అభివృద్ది చేసింది.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి లో మరో వినూతన రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ ఫీచర్. అధిక వేగం మీద ఉన్నపుడు మలుపుల్లో వెనుక చక్రం గాల్లోకి లేవడం, స్లిప్ అవ్వడాన్ని నివారించి రైడింగ్‌లో ఉన్నపుడు అత్యుత్త డైనమిక్ స్టెబిలిటి వీల్ లాక్ జరకుండా చూస్తుంది.ఏబిఎస్ మరియు నాన్-ఏబిఎస్ వేరియంట్ల రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. అయితే, వీటిలో ఏబిఎస్ వేరియంట్‌ను గుర్తించడానికి కుడివైపు ఫ్రంట్ మడ్ గార్డ్ పైభాగంలో ఏబిఎస్ స్టిక్కర్ ఉంటుంది. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ ఫీచర్ల జోడింపు మినహా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా అదే 197.75సీసీ కెపాసిటి గల గాలి/లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ ఫీచర్ల జోడింపు మినహా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా అదే 197.75సీసీ కెపాసిటి గల గాలి/లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోడల్ ఏబిఎస్ వెర్షన్ డిజైన్ పరంగా చూడటానికి రెగ్యులర్ మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, ఫ్రంట్ మడ్ గార్డ్ మీద ఏబిఎస్ అని సూచించే స్టిక్కర్ ఉంటుంది. ఇందులో పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ ఉంది. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఏబిఎస్ వేరియంట్లో సస్పెన్షన్ పరంగా ముందు వైపు టెలిస్పోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ విధుల కోసం ఫ్రంట్ వీల్‌కు 270ఎమ్‌ఎమ్ పెటల్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్‌ఎమ్ పెటల్ డిస్క్ బ్రేకులు డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఉన్నాయి.