ఆసియా క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణీగా సింధు నిలిచింది. ప్రపంచ నం.2 అకానె యమగూచి(జపాన్) పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. కోర్టు మొత్తం తిరుగుతూ ఇద్దరూ పాయింట్లు సాధించారు. తొలి గేమ్‌ను సులువుగానే 21-17తో సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌ను 15-21తో చేజార్చుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు అద్భుతంగా పోరాడింది.