YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

 వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. వాట్సాప్‌తోపాటు కేంద్ర సమాచార, ఆర్థిక శాఖలకు కూడా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టంచేసింది. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అసలు సదరు నకిలీ వార్త ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకునేలా ఓ వ్యవస్థ రూపొందించాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. అయితే ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగించినట్లు అవుతుందంటూ వాట్సాప్ అందుకు నిరాకరించింది. నకిలీ వార్తలపై యూజర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. అసలు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదంటూ నిలదీసింది.

Related Posts