YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తోటపల్లి గూడూరు మండలంలో మంత్రి సోమిరెడ్డి పర్యటన

తోటపల్లి గూడూరు మండలంలో మంత్రి  సోమిరెడ్డి పర్యటన
జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ముందుగా   పేడూరులోని పలు వీధుల్లో రూ.32 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అధికారులు, టీడీపీ నేతలతో కలిసి భూమి పూజ చేసారు. తరువాత తోటపల్లిగూడూరు సొసైటీ కార్యాలయంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  మృతదేహాలను ఉంచే ఐస్ బాక్స్ ను ఉచితంగా అందుబాటులో ఉంచిన తోటపల్లి గూడూరు, పేడూరు సొసైటీ నిర్వాహకులను మంత్రి  అభినందించారు. తోటపల్లి గూడూరు సొసైటీ ప్రగతిపథంలో నడుస్తోందని కితాబు నిచ్చారు. మంత్రి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో తొలిసారిగా రెండో పంట కొనుగోలుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేశాం.  రెండో పంట కొనుగోలుకు జిల్లాలో ఇప్పటివరకు ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. 15.5 కోట్ల విలువైన వెయ్యి టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. నిర్ణీత తేమ శాతంతో మద్దతు ధరకు  విక్రయించుకునే హక్కు రైతుకు ఉంది. పంట కోత పూర్తవగానే తొందరపడకుండా మంచి ధరకు విక్రయించుకోవాలని అన్నారు. గత సీజన్లో 2.30 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. ఇప్పుడు మళ్లీ కొనుగోలు ప్రారంభించాం. వరి దిగుబడి హెక్టారుకు జాతీయ స్థాయి సగటు 3,600 కిలోలు, మన రాష్ట్ర సగటు 6,300 ఉండగా మన జిల్లాలో 9,300 కిలోలు ఉందని అన్నారు.  రైతులంటే నిర్వచనం తెలియని వాళ్లు కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఎంత ఆయకట్టు పెరిగిందో తెలుసుకుని మాట్లాడండి..  రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. గత ప్రభుత్వం కండలేరు జలాలను తరలించేందుకు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు కూడా ఇస్తే మీరు నిద్రపోతున్నారని అన్నారు. కండలేరు జలాల తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన మేము మా ప్రభుత్వం రాగానే రూ.5 వేల కోట్ల విలువైన వర్క్ ఆర్డర్లు రద్దు చేయించామని అన్నారు.  లేకుంటే తాగు, సాగునీటి సమస్య తలెత్తి నెల్లూరు డివిజన్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు గూడూరు డివిజన్ ఎడారిగా మారి ఉండేది.  ఇష్టం వచ్చినట్లు మైకుల్లో తిట్టడం,  తప్పుడు కథనాలు సృష్టించడం కొందరికి అలవాటుగా మారిపోయిందని అన్నారు.

Related Posts