YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం స్పిల్ ఛానల్ ను పరిశీలించిన మంత్రి దేవినేని

 పోలవరం స్పిల్ ఛానల్ ను పరిశీలించిన మంత్రి దేవినేని
2019 నాటి కల్లా పోలవరం ప్రాజెక్టు నుండి గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాలకు నీటిని అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.సోమవారం టెక్నికల్ యడ్వాయిజరి కమిటి సభ్యుల  బృందంతో పోలవరం ప్రాజెక్టు సందర్శించిన దేవినేని ముందుగా పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే, స్పిల్ చానల్  ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ అయిన రిటైడ్ ఇంజనీరింగ్ చీఫ్ లు సూపరిండెంట్లు ఇంజనీర్లు రోశయ్య, రెహమాన్, బిఎస్ఎన్ రెడ్డి, ఐఎస్ఎన్ రాజు తదితరుల బృందానికి  పోలవరం ప్రాజెక్టు వివరాలను వివరించారు.  అనంతరం ఈ బృందం సభ్యులు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో అధునాతన టెక్నాలజీతో వేగవంతంగా పోలవరం ప్రాజెక్టు పనులు చేయడం సామాన్య  విషయం కాదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరునీ, ఇంజనీరింగ్ అధికారులు పనితీరుని కొనియాడారు. 1941లో స్వాతంత్రానికి ముందు గా ప్రణాళిక వేసుకున్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత  గడిచిన రెండేళ్లలో వేగవంతంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం సామాన్య విషయం కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు భారతదేశానికే  జీవనాడి అన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో వారానికల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే లో గ్యాలరీ వాక్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 2702 రూ కోట్ల రూపాయలు నిధులు రావాల్సి ఉన్నాయన్నారు. నాలుగు నెలల్లో  లక్ష మంది పర్యాటకులు పోలవరం ప్రాజెక్టును సందర్శించారన్నారు. ఈ ఏడాది 1890 టీఎంసీలు నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లిందని, కేవలం 60 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 770 చెరువులను నింపడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 16 జాతీయ ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయని పోలవరం పనులు మాత్రం ఆగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదలకు కార్మికులు కొండలపై తలదాచుకుని పోలవరం ప్రాజెక్టు పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా సహకరించారన్నారు. స్పిల్ చానల్ పనులకు మాత్రం  ఆటంకం కలిగిందన్నారు.  పట్టిసీమ ద్వారా 33 టీఎంసీల గోదావరి  నీటిని విడుదల చేశామన్నారు.అభివృద్ధి చూడలేక రాజన్న మంత్రులు హైకోర్టులో కేసులు వేశారని,ప్రజల ముందు మాయ మాటలు చెబుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇతర రాష్ట్రాల వారిని రెచ్చగొడుతూ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు లో కేసులు వేసి పోలవరం ప్రాజెక్టులో సగం మంది ఇంజనీర్లు, అధికారులను కోర్టుల చుట్టూ  తిప్పుతున్నారన్నారు.ప్రాజెక్టులో డామ్ సైట్ పనులు 57.71% హెడ్ వర్క్ పనులు 44.57 శాతం ఎర్త్ ఎక్ష్కవేసన్ పనులు 77.31% . 34.5% కాంక్రీట్ పనులు, మొత్తంమీద 66%  పనులు పూర్తయ్యాయన్నారు. 420 ప్రాజెక్టులకు  గేట్లు తయారుచేసిన నాయుడు బృందం ప్రాజెక్టు గేట్లు తయారీలో పాల్గొన్నారన్నారు. ఏప్రిల్ 1 నాటికి తొలి గేట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, జూన్ నెలలో గ్రావిటీ ద్వారా నీటిని అందించడం జరుగుతుందని అన్నారు. రేడియల్ గేట్లు 61.8 శాతం, డయాఫ్రంవాల్ 100%పని  పూర్తయిందన్నారు.  1,397 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యిందని, కేవలం 15 నెలలలో ఎల్ఎన్టి కంపెనీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసిందన్నారు. రానున్న సీజన్లోఎర్త్ కం రాక్ ఫిల్డామ్ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. పోలవరం కాలువ పనులు 90% పూర్తయ్యాయని, కృష్ణాడెల్టాకు    పోలవరం కుడి కాలువ ద్వారా 33 టీఎంసీల నీరు అందించి పది లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చామన్నారు. ఈ వారంలో 13 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. పోతిరెడ్డి, హంద్రీ-నీవా, తెలుగుగంగ ద్వారా సాగునీరు ఇస్తామన్నారు. కర్నూలు కడప జిల్లాలకు 40 నుండి 50 టీఎంసీల నీరు అందించామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటితో పూర్తిగా నిండిందని, నాగార్జునసాగర్ ఒక వారం రోజుల్లో నిండుతుందన్నారు.ఈనెల 30న పురుషోత్తపట్నం రెండవ దశలో భాగంగా ముఖ్యమంత్రి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తారన్నారు.  గోదావరి నీరు శ్రీకాకుళంలో సోంపేట వరకు  అందేలా అక్విడెక్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. వంశధార ,నాగావళి, చంపావతి,పంచవటిలను అనుసంధానం చేస్తామన్నారు. మహేంద్రతనయ ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు. అమరావతి దగ్గర కొండవీడు  ప్రాజెక్టు కి టెండర్లు పిలుస్తున్నా మన్నారు. వైకుంటపురం బ్యారేజీకి టెండర్లు పిలుస్తున్నామన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెన్నా గోదావరి నదుల అనుసంధానం టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు.  సెప్టెంబర్ నెలలోవెలుగొండ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి పరిశీలిస్తారన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కలని 2018 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి చేశారన్నారు. లేపాక్షి ద్వారా హిందూపురానికి సాగునీరు అందిస్తున్నామన్నారు. చిత్తూరు, మదనపల్లి,పలమనేరు లకు కృష్ణాడెల్టానుండి  సాగునీరు అందిస్తామన్నారు. చిత్తూరు, కడప, పులివెందుల సాగునీరు ఇచ్చామన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గురువారం లోటస్పాండ్లో భారతి సిమెంట్ గురించి, సాక్షి ఛానల్ గురించి ,సాక్షి పేపర్ గురించి జమాఖర్చులు తెలుసుకోవడానికి మాత్రమే సమయం సరిపోతుందని, ఇతర రాష్ట్రాల వారిని రెచ్చగొట్టి పోలవరం ప్రాజెక్టు ని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అభ్యంతరాలు తెలుపుతూ పోలవరం ప్రాజెక్ట్ లో ఇంజినీర్లు సగం మందిని కోర్టులు చుట్టూ తిప్పుతూ ఉన్నారన్నారు. 14723 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ కి ఖర్చు చేశామని, 14765 కోట్లు పోలవరం ప్రాజెక్టు డ్యాం సైట్ కి ఖర్చు పెట్టడం జరిగిందని ,2702 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు రావాల్సి ఉందన్నారు. 
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీకి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నివేదిక తెలియజేసి పోలవరం ప్రాజెక్ట్ రియంబర్స్మెంట్ నిధులు రప్పించేందుకు ల్యాండ్ ఆక్విడేషన్ ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారన్నారు. లక్ష కోట్లు అప్పు తో రాష్ట్రం ప్రారంభమైందని, 16500 కోట్లు లోటు బడ్జెట్ లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే అన్నారు.                           
 

Related Posts