ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం లో 347 వ సప్తఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 65 లక్ష లతో నిర్మించిన 33 వ్యాపార దుకాణాలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా ఉన్న కె.ఈ. కృష్ణమూర్తి ,శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామిజీ చేతుల మీదుగా ప్రారంభించు. డిప్యుటీ సిఎమ్. మాట్లాడుతూ మంత్రాలయం చాలా అభివృద్ధి చెందింది. పీఠాధిపతి వ్యాపార దుకాణాలను నిర్మించి పేదల కు ఇవ్వడం మంచి పరిణామమని , వికలాంగులను ఆదుకోవడంం, నిరు పేదలకు ఉద్యోగాలు కల్పించడంలో పీఠాధిపతి చొరవ తీసుకుని అబివృద్ది చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ మఠం అభివృద్ధికి మా ప్రభుత్వం ఎల్లా వేళలా అండగా ఉంటుందని అలాగే నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.