YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుదీర్ఘంగా సాగిన బీజేపీ సీఎంల భేటీ

సుదీర్ఘంగా సాగిన బీజేపీ సీఎంల భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల భేటీ సుదీర్ఘంగా సాగింది. ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా నేతలంతా  మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళి అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 2019లో ఎలా గెలవాలన్నదానిపై దృష్టి పెట్టారు బీజేపీ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి.   ఈ రాష్ట్రాల్లో విపక్ష కాంగ్రెస్  బలపడినట్లు  చాలా సర్వేల్లో తేలింది. దీంతో  కమలంపార్టీ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ లో 15 సంవత్సరాల నుంచి  బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు విపక్షాలకు వెళ్లకుండా ఎలా చీల్చాలన్నదానిపైనా చర్చ జరిగింది.  12 ముఖ్యమైన కేంద్ర పథకాల అమలు తీరుపై  ముఖ్యమంత్రులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ర్యాలీలు నిర్వహించాలని మోదీ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 400 లోక్ సభ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.  త్వరలో ఎన్నికలు జరగబోతే  మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో   మోదీ పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో జరిగిన  భేటీకి   ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏడుగురు ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా,  కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కీలక కేంద్ర మంత్రులు హజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్ సభతో పాటు శాసన సభ ఎన్నికలకు  సిద్దంగా ఉండాలని సూచించారు. స్వచ్ఛ భారత్  లక్ష్యాన్ని ఛేదించాలని మోదీ పిలుపునిచ్చారు.  యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని... దేశాన్ని అద్దంలా తీర్చిదిద్దాలని చెప్పారు.    పార్టీ ఛీఫ్ అమిత్ షా మాట్లాడుతూ   లోక్ సభ ఎన్నికలతో పాటు, శాసన సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే  బీజేపీకి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలన్న  మోదీ నినాదంపైనా చర్చ జరిగింది. లోక్ సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన. దీనిపై వ్యతిరేకత  వస్తున్నా పట్టించుకోకుండా  ఆయన ముందుకే వెళ్తున్నారని అన్నారు.

Related Posts