నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. తీవ్రంగా గాయపడిన ఆయన్ను వెంటనే నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. ఛాతికి స్టీరింగ్ బలంగా ఢీకొనడంతోపాటు.. తలకు తీవ్రంగా గాయం కావడంతో రక్తస్రావమైంది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఆయన్ను కాపాడలేకపోయారు. ఉదయం 7.30 గంటలకు ఆయన మరణించారని డాక్టర్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా.. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.తెల్లవారుజామున 4.30 గంటలకు తానే డ్రైవ్ చేస్తూ బయలుదేరిన హరికృష్ణ
ఏపీ28 బీడబ్ల్యూ 2323 కారులో నెల్లూరు జిల్లా కావలిలో ఓ వివాహానికి బయలుదేరిన హరికృష్ణ
ప్రమాద సమయంలో కారులో హరికృష్ణతోపాటు ఇద్దరు వ్యక్తులు.. ప్రమాదంలో గాయపడ్డ వెంకట్రావు, అరికెపుడి శివాజీ. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను
ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు
ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తమ కార్యక్రమాలను
రద్దు చేసుకొ్న్నారు.