‘‘నందమూరి హరికృష్ణగారి మృతి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి నిజంగా తీరనిలోటు’’ -మంత్రి నారా లోకేష్
‘‘నందమూరి హరికృష్ణ చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’- వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్
‘‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త ఎంతో విచారం కలిగిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా ప్రియమైన సోదరుడు తారక్, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’- మహేష్‌బాబు
‘‘హరికృష్ణగారు చనిపోయారన్న వార్త నమ్మలేకపోతున్నా. గుండె పగిలిపోతోంది. నాకు, నా తండ్రికి ఎంతో ఆప్తులు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు ఆ దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలి’’- దేవిశ్రీ ప్రసాద్
‘‘హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని షాకయ్యా! వ్యక్తిగతంగా ఆయన్ను ఎప్పుడూ కలవలేదు. కానీ, ఎంతో కాలం నుంచి తెలిసిన వ్యక్తిలా అనిపించేవారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ -నాని
‘‘ఎంతో హృదయ విదారక వార్తను విన్నా. హరికృష్ణగారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఆయనొక డైనమిక్, నిజయాతీ కలిగిన వ్యక్తి. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ -శ్రీను వైట్ల
‘‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది’’ - వరుణ్‌తేజ్
‘‘తారక్, కల్యాణ్‌రామ్ సర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వారికిది చాలా కఠిన సమయం. హరికృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ - వెన్నెల కిషోర్
‘‘నిజంగా షాక్. హరికృష్ణగారు మృతి చెందడంతో ఎంతో విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’- అనిల్ రావిపూడి
‘‘దేవుడు కఠినాత్ముడు. మాటలు రావడం లేదు. హరికృష్ణ అంకుల్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించాలి’’ - మంచు మనోజ్
‘‘నిద్ర లేవగానే ఇలాంటి భయంకరమైన వార్త వింటానని అనుకోలేదు. హరికృష్ణగారి మరణ వార్త విని విచారంతో నా హృదయం బరువెక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. తారక్, కల్యాణ్‌లకే కాదు, మొత్తం కుటుంబానికే ఆయన మరణం పెద్ద లోటు’’ -సుధీర్‌బాబు
‘‘నందమూరి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మరింత మనో ధైర్యం ఇవ్వాలి. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..’ -సాయిధరమ్‌తేజ్
‘‘నమ్మలేకపోతున్నా. ఆయన కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి’’ -మంచు విష్ణు