YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నంలో స్పోర్ట్సు సిటీ ఏర్పాటు: సిఎస్ దినేష్ కుమార్

విశాఖపట్నంలో స్పోర్ట్సు సిటీ ఏర్పాటు: సిఎస్ దినేష్ కుమార్
విశాఖపట్నంలో ఏర్పాటు చేయ ప్రతిపాదించిన క్రీడా నగరం(స్పోర్స్టు సిటీ)ఏర్పాటుపై సింగపూర్ కు చెందిన లగార్దేర్ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమావేశమై చర్చించారు.ఈమేరకు లగార్దేర్ క్రీడా సంస్థ ఆసియా బిజినెస్ డెవలప్మెంట్ ఉపాధ్యక్షులు మాల్కలం థోర్పే ఆసంస్థ స్టేడియం అండ్ ఎరీనాస్ డెవలప్ మెంట్ అండ్ సర్వీసెస్ ఉపాధ్యక్షులు స్టీఫెన్ పొట్టైర్లు అమరావతి సచివాలయంలో సిఎస్ దినేష్ కుమార్ ను కలిసి విశాఖలో స్పోర్స్టు సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై చర్చించారు.ఈసందర్భంగా లెగార్దేర్ సంస్థ ఉపాధ్యక్షులు మాల్కలం థోర్పే స్పోర్స్టు సిటీ ఏర్పాటుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ లగార్దేర్ సంస్థ ప్రపంచంలోనే ఉత్తమ క్రీడా మరియు ఎంటర్టైన్ మెంట్ సంస్థని పేర్కొన్నారు.20దేశాల్లోని 70 నగరాల్లో లగార్దేర్ సంస్థ క్రీడా సౌకర్యాలు అభివృద్ధిలో మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు.ఈ సందర్భంగా సిఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నంలో స్పోర్స్టు సిటీ(హబ్) ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని చెప్పారు.క్రీడా నగరం ఏర్పాటుకు సంబంధించి ఏవిధమైన క్రీడా మౌళిక సౌకర్యాలు కల్పించాలనే దానిపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అన్నారు.విశాఖలో ఏర్పాటు చేయబోయే క్రీడా హబ్ ద్వారా జాతీయ,అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే రీతిలో దీనిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అందుకు అనుగుణంగా అక్కడ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.దుబాయ్, అమెరికా తదితర దేశాల నుండి వస్తున్న ప్రతిపాదనలను పరిశీలించి ఈక్రీడా నగరాన్ని ఏవిధంగా నిర్మించాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర క్రీడలు,యువజన సంక్షేమశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి.సుబ్రహ్మణ్యం,ప్రణాళికశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Related Posts