దేశవ్యాప్తంగా అయిదుగురు మానవ హక్కుల నేతలను అరెస్టు చేయడాన్ని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. దేశం నియంతృత్వం దిశగా వెళ్తోందని ఆయన ఆరోపించారు. భీమా కోరేగావ్ అల్లర్ల కేసు విచారణలో భాగంగా హక్కుల నేతలు వెర్నాన్ గొంజాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖాలతో పాటు వరవరరావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిదుగురు నేతల్ని అరెస్టు చేయడమంటే.. దేశం ఎమర్జెన్సీ వైపు వెళ్తోందని, దీన్ని ఖండిస్తున్నట్లు లాలూ తెలిపారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. అయితే ఇవాళ పాట్నా నుంచి రాంచీకి వచ్చిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.