మూడో టెస్టులో గ్రాండ్ విక్టరీతో సిరీస్ ఓటమి అంచుల నుంచి పుంజుకున్న టీమిండియా.. సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మరోవైపు నాటింగ్హామ్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పుంజుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి కోహ్లీసేన అప్రమత్తంగా ఉండాల్సిందే.