YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గృహనిర్బంధంలో వరవరరావు పుణె నుంచి హైదరాబాద్‌కు తీసుక వచ్చిన పోలీసులు

గృహనిర్బంధంలో వరవరరావు పుణె నుంచి హైదరాబాద్‌కు తీసుక వచ్చిన పోలీసులు
విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి సెప్టెంబర్‌ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచనున్నారు. ప్రధాని హత్యకు కుట్ర రచన, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వరవరరావుపై ఉన్నాయి.వరవరరావు ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి పుణె తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వరవరరావు సహా ఐదుగురు పౌరహక్కుల నేతలను పుణె పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల నేతలు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరహక్కుల కార్యకర్తలను కారాగారంలో పెట్టొద్దని.. గృహనిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరవరరావును పుణె నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

Related Posts