సినిమాలో ఎంత బాగా యాక్ట్ చేసినా..ఆ పాత్రకి వేరేవాళ్లు డబ్బింగ్ చెప్తే ఆ లోటు తెలుస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పడు టాలీవుడ్ హీరోయిన్స్ గొంతు సవరించుకుంటున్నారు. కష్టపడి తెలుగు నేర్చుకోని మరీ డబ్బింగ్ తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పడు ఆ లిస్ట్‌లోకి చేరింది అందాల భామ పూజా హెగ్డే. ఆ విశేషాలేంటో చూసేద్దాం పదండికథానాయికలు సొంత గొంతుని వినిపించేందుకు పోటీపడుతున్నారు. ఇదివరకు అరువు గొంతులపైనే ఆధారపడిన భామలంతా ఇప్పుడు ఉత్సాహంగా తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకొనేందుకు ముందుకు వస్తున్నారు. పూజా హెగ్డే ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `అరవింద సమేత`లో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం పూజా సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటోంది. తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటున్నానోచ్ అంటూ తెగ సంబరపడుతోంది పూజా.స్వతహాగా పూజా కన్నడ అమ్మాయి... అయినా కూడా తెలుగుపై త్వరగానే పట్టు పెంచుకుంది. అందుకే త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్పమని కోరాడట. అందుకు ఓకే అనేసిన పూజా రికార్డింగ్ థియేటర్లోకి అడుగుపెట్టింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఈమధ్య నటిస్తున్న కథానాయికలంతా కూడా సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. `అజ్ఞాతవాసి`లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ - కీర్తి సురేష్ సొంత గొంతులే వినిపించారు. ఇప్పుడు పూజ వంతు వచ్చింది. దసరాకి రిలీజ్ కానున్న `అరవింద సమేత` సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు అప్పుడు జోరందుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ లాంటి చాలామంది హీరోయిన్స్ తమ ఓన్ వాయిస్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకంటున్నారు. మరి పూజా హెగ్డే తన వాయిస్‌తో ఎంతమేర మెస్మరైజ్ చేస్తుందో తెలియాలంటే అరవింద సమేత రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.