తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తనను పార్టీలో చేర్చుకోకపోతే స్టాలిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తదన్న ఆయన సోదరుడు ఎంకే అళగిరి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనను పార్టీలో చేర్చుకుంటే.. స్టాలిన్ డీఎంకే అధినేతగా అంగీకరిస్తానని చెప్పారు. పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని అళగిరి స్పష్టం చేశారు. స్టాలిన్‌ను లీడర్‌గా అంగీకరించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అళగిరిని 2014లో డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం విదితమే.ఎంకే అధ్యక్ష ఎన్నికకు కొన్ని రోజుల ముందు అళగిరి మాట్లాడుతూ.. తనను మళ్లీ డీఎంకేలోకి చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్టాలిన్‌ను హెచ్చరించారు. లేకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తనా సత్తా ఎంటో చూపిస్తానని అన్నారు. పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. తాజాగా అళగిరి తన వైఖరి మార్చుకోవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.