YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆప్ పేరుతో మరో పార్టీ...

 ఆప్ పేరుతో మరో పార్టీ...
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మరో చిక్కొచ్చిపడింది. అదే సంక్షిప్త నామం వచ్చేలా మరో పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం కూడా వచ్చింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను ఈసీ తోసిపుచ్చింది. దీంతో ఆ పార్టీ హైకోర్టును ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఈసీని, కొత్త ఆప్ పార్టీని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఆప్‌కీ ఆప్నీ పార్టీ (ఆప్‌) పేరుతో ఎన్నికల సంఘం వద్ద ఇటీవలే ఓ కొత్త పార్టీ నమోదైంది. ఆ పార్టీ రిజస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనివల్ల పార్టీ పేరు విషయంలో ప్రజలు పొరబడే అవకాశముందని, అదే జరిగితే తమ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఆప్ అభ్యంతరాన్ని ఈసీ తోసిపుచ్చడంతో.. ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈసీతో పాటు, ఆప్‌కీ ఆప్నీ పార్టీ (ఆప్‌)కి నోటీసులు జారీ చేసింది. ఆప్ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం అరవింద్ కేజ్రీవాల్‌కు తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో ఏకంగా పార్టీ పేరుకే ఎసరు తెచ్చేలా ముందుకువచ్చిన తాజా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

Related Posts